2011 వన్డే ప్రపంచకప్ విజయానికి నేటితో పదేళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ…’ఒక వ్యక్తి మాత్రమే ప్రపంచకప్ గెలిచారని మీరు అనుకుంటున్నారా?. ఒక వ్యక్తి ప్రపంచకప్ గెలవగలిగితే.. భారత్ ఇప్పటివరకు అన్ని టోర్నీలు గెలిచేది. దురదృష్టం ఏంటంటే.. భారతదేశంలో కొంతమంది వ్యక్తులను ఎక్కువగా ఆరాధిస్తుంటారు. నేను అలాంటివి ఎప్పుడూ నమ్మను. జట్టు ఆటలో వ్యక్తులకు స్థానం లేదు. ఫైనల్లో జహీర్ ఖాన్ సహకారాన్ని మీరు మరచిపోగలరా?. ఆస్ట్రేలియాపై యువరాజ్ సింగ్ ఆటను మరచిపోగలరా?. దక్షిణాఫ్రికాపై సచిన్ టెండూల్కర్ చేసిన సెంచరీ సంగతేంటి?. ఆ ఒక సిక్స్ గురించే ఎందుకు చర్చిస్తారు. 2007 ప్రపంచకప్‌లో ఆరు సిక్సులు బాదిన యువరాజ్ ఎవరూ మాట్లాడరే’ అని ప్రశ్నించాడు. అది గర్వపడే సందర్భం కానీ ఇప్పుడు భారత్ ముందుకు సాగాల్సిన సమయమిది. వీలైనంత త్వరగా మరో ప్రపంచకప్‌ను గెలవాలి’ అని బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ అన్నాడు. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ లో గౌతీ (97) పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.
previous post
తనను గద్దె దింపేందుకు బీజేపీ ఎన్నో కుట్రలు: కుమారస్వామి