స్టీల్ ప్లాంట్ ఉద్యమం రోజు రోజు ఉదృతమౌతోంది. ఇప్పటికే ఏపీలోని అన్ని పార్టీలు ప్రైవేటీకరణను వ్యతిరేకించాయి. అయితే.. గత వారం కింద స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మంత్రి కేటీఆర్ మద్దతు తెలిపారు. అంతేకాదు.. కేసీఆర్ ఆర్డర్ వేస్తే.. వైజాగ్ వెళ్లి మరీ.. ఉద్యమం చేస్తానని మంత్రి కేటీఆర్ అన్నారు. దీంతో ఏపీలో కేటీఆర్కు పాలభిషేకాలు కూడా చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా.. అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ ని కలిసారు టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు మద్దతు తెలిపినందుకు ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు గంటా శ్రీనివాసరావు. అంతేకాదు వైజాగ్ ఉక్కు ఉద్యమంకు సంఘభావం చెప్పేందుకు అక్కడికి రావాలని కేటీఆర్ ను కోరారు గంటా శ్రీనివాసరావు. దీంతో వీరిద్దరి కలియిక అటు ఏపీ, ఇటు తెలంగాణలోనూ చర్చనీయాంశంగా మారింది.
previous post
next post


రామ్గోపాల్ వర్మ సైకో డైరెక్టర్: యామిని