telugu navyamedia
ఆంధ్ర వార్తలు నరేంద్ర మోదీ రాజకీయ వార్తలు

కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశం మొత్తానికి మోదీ ఒక స్ఫూర్తి: పవన్ కల్యాణ్

ఢిల్లీలో ఇవాళ ఎన్డీయే లోక్ సభా పక్ష నేతను ఎన్నుకునే కార్యక్రమానికి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు.

ఎన్డీయే కూటమి నేతగా మోదీని ఏకగ్రీవంగా ఎన్నుకున్న సందర్భంగా పవన్ ప్రసంగించారు.

కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశం మొత్తానికి మోదీ ఒక స్ఫూర్తి అని కొనియాడారు.

మోదీ స్ఫూర్తితోనే తాము ఏపీలో ప్రభంజనం సృష్టించగలిగామని చెప్పారు. మోదీ దిశానిర్దేశంతో రాష్ట్రంలో 91 శాతానికి పైగా సీట్లు గెలుచుకోగలిగామని అన్నారు.

ఎన్డీయే పక్ష నేతగా మోదీకి తాము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని, ఆయన వెనుక తామంతా ఉన్నామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

మోదీ ప్రధానమంత్రి పీఠంపై ఉన్నంత వరకు భారత్ ఏ దేశానికి భయపడదని అన్నారు. మోదీ నాయకత్వంలో పనిచేయడం గర్వంగా భావిస్తున్నామని తెలిపారు.

Related posts