రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్ డీ) అధినేత, మాజీ కేంద్ర మంత్రి అజిత్ సింగ్ (82) మృతి చెందారు. గత నెల 20న కరోనా బారిన పడిన ఆయన…గురుగ్రామ్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మరణించారు. మాజీ ప్రధాని చరణ్ సింగ్ కుమారుడైన అజిత్ సింగ్ రాజ్యసభ, లోక్ సభ సభ్యుడిగానూ పని చేశారు. యూపీఏ హయాంలో పౌర విమానయాన మంత్రిగా అజిత్ సింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. అంతే కాదు యూపీలోని బాగ్ పాట్ లోక్ సభ స్థానం నుంచి ఏకంగా 7 సార్లు ఎంపిగా గెలిచారు. ఇక ఆయన మృతి పట్ల ప్రధాని మోడితో పాటు పలుగురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
previous post
next post


జగన్ పరిపాలనకు తుగ్లక్ పరిపాలనకు దగ్గరి పోలికలు: అనూరాధ