పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ తౌఫిక్ ఉమర్ కరోనా పాజిటివ్‌గా తేలింది. శనివారం అనారోగ్యంగా అనిపించడంతో కరోనా పరీక్ష చేయించుకున్నానని, అందులో పాజిటివ్ వచ్చిందని ఆయన వెల్లడించారు. తాను ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉంటున్నానని తెలిపారు. తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. లాహోర్‌కు చెందిన 38 ఏండ్ల తౌఫిక్ ఉమర్ 2014లో పాక్ తరఫున చివరి మ్యాచ్ ఆడాడు. 2001లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ వన్డేల్లోకి అరంగేట్రం చేసిన తౌఫిక్, మొత్తం 50 వన్డే మ్యాచ్‌ల్లో 504 పరుగులు చేశాడు. 44 టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఆయన 2963 పరుగులు చేశాడు. అయితే ఇంకా అధికారికంగా రిటైర్‌మెంట్‌ను ప్రకటించలేదు.
తెలంగాణ కాంగ్రెస్ పై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!