telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రశ్నిస్తున్నందునే నన్ను సస్పెండ్ చేశారు: అచ్చెన్నాయుడు

ache Naidu tdp

రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న హామీల విస్మరణ తదితర అంశాలను ప్రశ్నిస్తున్నందునే నన్ను సభ నుంచి సస్పెండ్ చేశారని టీడీపీ ఉప నాయకుడు అచ్చెన్నాయుడు అన్నారు. సభ నుంచి సస్పెండ్ అయిన అనంతరం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ..అధికార పార్టీ నాయకులు తీసుకొచ్చిన వీడియోలను చూపించిన డిప్యూటీ స్పీకర్, తాము తీసుకొచ్చిన వాటిని చూపించాలని డిమాండ్ చేశామనితెలిపారు.

ఇరు పక్షాల వీడియోలు చూసిన అనంతరం ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారంటే దానిని కూడా వినలేదన్నారు. వారి ఏకైక ధ్యేయం బలహీనవర్గానికి చెందిన తాను ఉప నాయకుడిగా తన స్థానం నుంచి కదల్లేదని, అసభ్యంగా మాట్లాడలేదని అలాంటి తనను కావాలనే సస్పెండ్ చేశారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.

Related posts