నిన్న రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఎయిమ్స్‌లోని తొమ్మిదవ అంతస్తులో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. 22 ఫైర్ టెండర్స్ తో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. తొమ్మిదవ అంతస్తులో డయాగ్నోస్టిక్ ల్యాబ్‌లు, పరీక్షా విభాగాలు ఉన్నాయని, కొవిడ్ 19 నమూనాలను సేకరించిన ప్రాంతంలో మంటలు చెలరేగినట్టు అధికారులు పేర్కొన్నారు. అయితే, ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు.
previous post
next post