telugu navyamedia
రాజకీయ వార్తలు

బీజేపీకి ఈసారి తీవ్ర పరాభవం: చంద్రబాబు

chandrababu on amaravati mla quarters

బీజేపీకి ఈసారి తీవ్ర పరాభవం తప్పదని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు జోస్యం చెప్పారు. ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీతో సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 23 తర్వాత దేశం కొత్త ప్రధానిని చూడబోతోందని నాయుడు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చాక అందరూ కూర్చుని చర్చించి ప్రధాని అభ్యర్థి గురించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.

ప్రధాని ఎవరు అన్నది మీరు, నేను నిర్ణయించలేమని చెప్పారు. మెజారిటీ ప్రజలు ఇప్పటికే తమ తీర్పును ఇచ్చేశారన్నారు. ఈనెల 23న ఫలితాల అనంతరం దేశానికి ఎవరు ప్రధాని అయితే మంచిదన్న విషయమై ఏకాభిప్రాయానికి వస్తామని వెల్లడించారు. మే 21న సమీక్షా సమావేశం జరుగుతుంది. మే 23 తర్వాత సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు. అనంతరం కలకత్తాకు బయలుదేరారు. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తరఫున చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేయనున్నారు.

Related posts