telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

జైల్లో ఉన్నవారు 90 శాతం బీదవారే: వీకే సింగ్

vk singh

సామాజిక కార్యకర్తల్లా ఉండాల్సిన పోలీసులు.. డబ్బు, అధికారం ఉన్నవాళ్లతోనే స్నేహంగా ఉంటున్నారన్నారని పోలీస్ అకాడమీ డైరెక్టర్ వీకే సింగ్ ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేవలం డబ్బు ఉన్నవారికి మాత్రమే పోలీసులు పనిచేస్తున్నారని.. జైల్లో ఉన్నవారు 90 శాతం బీదవారే అని వాపోయారు.పోలీసులు ప్రభుత్వనికి జవాబుదారీ కాదని.. చట్టానికి, న్యాయానికి మాత్రమేనన్నారు. అకాడమీలో ఇస్తున్న శిక్షణ గ్రౌండ్ స్థాయిలో పనికి రావడం లేదని విమర్శించారు.

ట్రెయినింగ్ అకాడమీలు.. డంపింగ్ యార్డులుగా మారాయని తీవ్రస్థాయిలో విమర్శించారు.పోలీసు ట్రైనింగ్ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాయన్నారు. అదంతా వృధా అవుతోందన్నారు. పోలీస్ అకాడమీలు స్కూళ్లు, కాలేజీలు కావని.. ప్రజలతో పోలీసులు ఎలా ప్రవర్తించాలో శిక్షణలో నేర్పించాలన్నారు. పోలీసులు చెప్పింది ప్రజలు వింటారని.. కానీ ప్రజలకు పోలీసులతో ఎలాంటి లాభం లేదని వీకే సింగ్ వ్యాఖ్యానించారు. ట్రైనింగ్ సెంటర్‌లలో శిక్షణ తీసుకుని బయటకు వెళ్తున్న అధికారులు, డిపార్ట్‌మెంట్‌కు మంచి పేరు తీసుకు రాలేకపోతున్నారని అన్నారు.

Related posts