telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మిలింద్ నగ్న ఫోటో… కేసు నమోదు చేసిన గోవా పోలీసులు

Milind

రీసెంట్‌గా హాట్ బాంబ్ పూనమ్ పాండే గోవాలో చేసిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. గోవాలోని చపోలీ డ్యామ్ వద్ద పూనమ్‌ అసభ్య వీడియోలను చిత్రీకరించడంతో ఆమెను అరెస్ట్ చేశారు అక్కడి పోలీసులు. ఇదిలాఉంటే అదే గోవాలో మరో సినీ నటుడు మిలింద్ సోమన్ ఏకంగా దుస్తులన్నీ ఊడదీసుకొని నగ్నంగా పరుగు పెడుతూ ఫోటోలకు ఫోజులిచ్చారు. తన పుట్టిన రోజు సందర్భంగా భార్యతో కలిసి గోవా వెళ్లిన ఆయన ఇలా న్యూడ్ ఫోటోలు దిగి వాటిని ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. దీంతో మిలింద్ సోమన్ వ్యవహారంపై వ్యతిరేకత వచ్చింది. పైగా నటి పూనమ్ చేస్తే తప్పుగానీ.. నటుడు సోమన్ చేస్తే తప్పులేదా? అనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో గోవా సురక్షా మంచ్ సభ్యులు మిలింద్ సోమన్‌పై చేసిన ఫిర్యాదు మేరకు గోవా పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. పబ్లిక్‌గా ఇలా హద్దులు దాటి నగ్న ప్రదర్శన చేయడం నేరమని.. అసభ్యత, అశ్లీలత అంశాల కింద మిలింద్‌పై సౌత్ గోవా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయంపై దక్షిణ గోవా ఎస్పీ పంకజ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. ఐపీసీ సెక్షన్ 294 ప్రకారం మిలింద్ సోమన్‌పై కేసు ఫైల్ చేశామని పేర్కొన్నారు. అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద పలు సెక్షన్స్ అప్లై చేశామని అన్నారు.

Related posts