పాప్ సింగర్, నటి, టీడీపీ విధేయురాలు స్మిత చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో మంట పుట్టిస్తోంది. చంద్రబాబుకి వీర విధేయురాలుగా ఉన్న స్మిత ఏపీ సీఎం జగన్‌పై పరోక్షంగా చేసిన ఈ ట్వీట్‌పై వైసీపీ వర్గాల్లో మంట పుట్టించింది. కరోనా ప్రభావంతో ఏపీలో స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తూ ఎలక్షన్ చీఫ్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకోవడంతో ఏపీ ప్రభుత్వం ఈసీ నిర్ణయాన్ని తప్పుపట్టింది. మొత్తానికి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి తన కులానికి చెందిన చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ వైసీపీ విమర్శలు గుప్పించింది. ఈ ఇష్యూపై సింగర్ స్మిత ఇన్ డైరెక్ట్‌గా స్పందిస్తూ చేసిన ట్వీట్‌పై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. స్మిత తన ట్విట్టర్‌లో ప్రముఖ కవి గుర్రం జాషువా చెప్పిన కొటెషన్లను పోస్ట్ చేస్తూ ఇది నిజం అంటూ ట్వీట్ చేసింది. ‘గుణం లేనివాడు కులం గొడుగు పడతాడు.. మానవత్వం లేనివాడు మతం ముసుగు వేస్తాడు.. పసలేని వాడు ప్రాంతం ఊసెత్తుతాడు.. జనులంతా ఒక కుటుంబం.. జగమంతా ఒక నిలయం’ అంటూ పోస్ట్ చేసింది. అయితే ఈ ట్వీట్ ఏపీ సీఎం జగన్- ఈసీ మధ్య జరిగిన రగడను ఉద్దేశించి చేసిందంటూ వైసీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
మీకు ఎంత కుల పిచ్చి ఉందో చంద్రబాబుపై మీరు చేసే భజన చూస్తే అర్థమైపోతుంది. అలాంటి మీరు కులం గురించి మాట్లాడుతుంటే.. పతివ్రత పాయసం వండితే వారం రోజులు చల్లారలేదు అనే సామెత గుర్తొస్తుంది అంటూ స్మితను ఓ రేంజ్‌లో ట్రోల్ చేయడంతో.. ఆ ట్వీట్‌ను డిలీట్ చేసింది స్మిత. టీడీపీ పార్టీకి విధేయురాలుగా ఉండే సింగర్ స్మిత అంటే చంద్రబాబుకి ప్రత్యేక అభిమానం. ఇటీవల స్మిత 20 ఏళ్ళ కెరీర్‌ను పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమెను అభినందిస్తూ లేఖను పంపించడం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. ‘స్మిత తన మధుర కంఠంతో నవయువ పండిత పామరులను రంజింజేస్తుందని ఆశిస్తూ.. ఆమెపై ప్రశంసల జల్లు కురిపించారు చంద్రబాబు. గాయనిగా నర్తకిగా తెలుగులో మొట్టమొదటి పాప్ ఆల్బమ్ రూపొందించడం గర్వకారణం.. ఆమె సేవలు అనిర్వచనీయం. భక్తిగీతాలను వీనువిందు చేసే స్మిత సంగీతానికి ఎల్లలు లేవని.. 9 భాషల్లో పాటలు పాడిన ఘనతను సాధించడం ప్రశంసనీయం’ అంటూ పొగడ్తల వర్షం కురిపించారు చంద్రబాబు. చంద్రబాబు తనపై ప్రశంసలు జల్లు కురిపించడంతో ఉబ్బి తబ్బిబ్బు అవుతూ.. ఈ లేఖను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ చంద్రన్నకు కృతజ్ఞతలు తెలిపింది స్మిత. ‘ఇది నిజంగా నాకు సర్‌ప్రైజ్. ధన్యవాదాలు చంద్రబాబు గారు’ అంటూ తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది స్మిత.
This truly came as a pleasant surprise 😊 I thank @ncbn garu for his wishes 🙏🏼 #AJourney #20Years pic.twitter.com/AwPPeaUEFV
— Smita (@smitapop) July 20, 2019