telugu navyamedia
సినిమా వార్తలు

100 కోట్ల క్లబ్ లో “ఎఫ్-2”

F2

వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన “ఎఫ్-2” ఈ నెల 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వెంకటేశ్ సరసన తమన్నా, వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సక్సెస్ టాక్ తో దూసుకెళ్తోంది. పూర్తి హాస్యభరితంగా నిర్మితమైన ఈ సినిమా వసూళ్ల పరంగా రికార్డు సృష్టిస్తోంది. దాదాపు 30 కోట్ల బడ్జెట్‌తో నిర్మింతమైన ఈ చిత్రం రెండు వారాల్లో రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా సత్తా చాటుతుండడం విశేషం. సినిమా వంద కోట్ల షేర్ సాధించడంపై దర్శకుడు అనీల్ రావిపూడి ఈరోజును ఎప్పటికీ మర్చిపోలేనంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. గతేడాది వరుస పరాజయాలను ఎదుర్కొన్న నిర్మాత దిల్ రాజుకు ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

Related posts