రెడ్డి సామాజికవర్గం గురించి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ తులసి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ యన మాట్లాడుతూ రెడ్డి క్యాస్ట్ కాదు అదొక ఒక టైటిల్ అని వ్యాఖ్యానించారు. టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన “కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” సినిమా టైటిల్ ను ప్రస్తావిస్తూ సినిమా అనేది వ్యాపార దృక్పదంతో తీసేదని తులసి రెడ్డి అన్నారు. కడప, రాయలసీమ, నెల్లూర్, ప్రకాశం జిల్లాలో రెడ్డి టైటిల్ ఉన్నవాళ్ళంతా కాపులే అని చెప్పారు.
పేరుకు రెడ్డి ఉన్నప్పటికీ కుల దృవీకరణ పత్రంలో క్యాస్ట్ “కాపు” అని ఉంటుందని వివరించారు. ఏపీ సీఎం వైస్ జగన్ మోహన్ రెడ్డి కూడా రెడ్డి కాదని పేర్కొన్నారు. వైస్ కుటుంభం కూడా కాపు అని వెల్లడించారు. ప్రస్తుతం వారు కన్వర్టెడ్ క్రైస్తవులుగా ఉన్నారని చెప్పారు. మైదుకూర్ ప్రాంతంలో బలిజే కులానికి చెందిన వారు కూడా రెడ్డి అనే టైటిల్ పెట్టుకుంటారని తులసీ రెడ్డి వెల్లడించారు. రఘువీరా రెడ్డి బీసీ కులానికి చెందినప్పటికీ రెడ్డి అని ఉంటుందన్నారు. అధేవిధంగా కడప జిల్లాలో 20 శాతం మాత్రమే రెడ్డి టైటిల్ కలిగినవారుంటారని, మిగితా 80 శాతం మంది ఇతర కులాలకు చెందిన వారుంటారని తులసి రెడ్డి పేర్కొన్నారు.

