telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఢిల్లీ రైతుల ఉద్యమం పై పాక్ స్పందన…

india pakistan

దేశ రాజధాని ఢిల్లీలో కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో భాగంగానే ఢిల్లీలో జనవరి 26 వ తేదీన రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. కానీ రైతుల ఉద్యమంలో కొన్ని అరాచక శక్తులు ప్రవేశించాయని, వారి వలన రైతుల పోరాటం పక్కదోవ పట్టిందని రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.  ఇప్పటికే కొన్ని సంఘాలు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాయి.  ఎర్రకోట ఘటన కేసులో పోలీసులు ఇప్పటికే వందలాదిమందిని అదుపులోకి తీసుకున్నారు.  ఇక ఇదిలా ఉంటె, రిపబ్లిక్ డే రోజున జరిగిన రైతుల ర్యాలీకి పాక్ మద్దతు ప్రకటించింది.  రైతులు సంఘీభావం తెలపడంతో పాటుగా, భారత్ లో మానవహక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని, ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితిలో ప్రస్తావిస్తామని, అమెరికాపై ఒత్తిడి తీసుకొస్తామని పాక్ విదేశీవ్యవహారాల శాఖామంత్రి పేర్కొన్నారు..  రిపబ్లిక్ డే ఘటన తరువాత దేశంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని రైతులు జాగ్రత్తగా గమనించాలని అయన పేర్కొన్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts