telugu navyamedia
తెలంగాణ వార్తలు

ఈటెల వివాదస్పద భూముల్లో సర్వే పూర్తి..

మెదక్ జిల్లాలో వివాదాస్పదమైన హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కుటుంబీకులకు సంబంధించిన భూములకు సంబంధించిన సర్వేపనులు ముగిశాయి. మాసాయిపేట తహసిల్ధా్ర్ మాలతి పర్యవేక్షణలో భూముల రికార్డులను పరిశీలించి సర్వే నిర్వహించారు.

మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాల పరిధిలో ఈటెల రాజేందర్ సతీమణిపేరుతో ఉన్న జమున హేచరీస్ కు చెందిన భూములను మూడురోజులపాటు సర్వే నిర్వహించి సాంకేతిక సమాచారంతో నివేదికను రూపొందించారు. సర్వే నంబరు 77 నుంచి 82 వరకు గల భూముల సర్వే పూర్తయిందని తహసిల్ధార్ మాలతీ తెలిపారు. భూముల వద్ద సర్వే రాళ్ల ఆనవాళ్లు లేకుండా పోయాయని సర్వేయర్లు పేర్కొన్నారు. 72 నుంచి 82 వరకున్న సర్వేనెంబర్ లతోపాటు సర్వే నెంబర్ 97లో హాకీంపేటలో సర్వే చేపట్టడుతున్నామని తహసిల్ధార్ మాలతీ తెలిపారు. ఈటెల రాజేందర్ కుటుంబీకులకు సంబంధించిన భూముల సర్వేకు సంబంధించి నివేదిక సిద్ధంచేశామన్నారు.

హకీంపేటకు చెందిన రైతులెవ్వరూ… ఈటెల రాజేందర్ కుటుంబీకులకు భూములు విక్రయించలేదని తెలిపారు. అచ్చంపేట లెక్కల దాఖలాలో ఉన్న భూముల్ని కొనుగోలు చేశారని అక్కడి రైతులు పేర్కొన్నారు. సర్వే అధికారులు మాత్రం హకీంపేట రైతులకు సంబంధించిన భూముల్లో మార్కింగ్ చేసి సర్వే నిర్వహించారని తెలిపారు. ఇక్కడి రైతులకు మాత్రం ఈటెల రాజేందర్ కుటుంబీకులు ఎలాంటి అన్యాయం చేయలేదని అక్కడి రైతులు అంటున్నారు.

Related posts