telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

కరోనా పై సీఎం కేసీఆర్ ఆదేశాలు…

Kcr telangana cm

కోవిడ్ సెకండ్ వేవ్ క‌ల్లోలం సృష్టిస్తున్న స‌మ‌యంలో.. వైద్య ఆరోగ్య‌శాఖ‌ చాలా కీల‌కం.. నిరంత‌రం ప‌ర్య‌వేక్షించాల్సిన అంశాలు ఎన్నో ఉంటాయి గ‌నుక‌.. వెంట‌నే సీఎస్ సోమేష్ కుమార్‌కు కీల‌క ఆదేశాలు జారీ చేశారు సీఎం కేసీఆర్. కరోనా విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, ప్రతిరోజూ మూడు సార్లు రివ్యూ నిర్వహించి స్వయంగా పర్యవేక్షించాలని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను ఆదేశించారు సీఎం. రెమిడెసివర్ వంటి మందుల విషయంలో గానీ, వాక్సీన్ విషయంలో గానీ, ఆక్సిజ‌న్ మరియు బెడ్ల‌ లభ్యత విషయంలో గానీ, ఏ మాత్రం లోపం రానీయొద్ద‌ని సీఎంకు స్ప‌ష్టం చేశారు.. అనుక్షణం కరోనా పర్యవేక్షణకు గాను  సీఎంవో నుంచి సీఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డిని ముఖ్యమంత్రి నియమించారు. ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులందరూ జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తూ.. చక్కగా పనిచేసి అనతికాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని కరోనా మహమ్మారి నుండి బయటపడేయాలని ఆకాంక్షించారు. మంత్రి ఈట‌ల రాజేంద‌ర్.. పై భూ క‌బ్జా ఆరోప‌ణ‌లు రావ‌డంతో వైద్య ఆరోగ్య‌శాఖ‌ను సీఎం కేసీఆర్‌కు బ‌దిలీ చేశారు గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై.

Related posts