అన్నం పెట్టే రైతు బాగుంటే దేశం సుభిక్షంగా ఉంటుందని తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలో నియంత్రిత పంటల సాగుపై రైతు బంధు సమితి, మండల సమన్వయ కర్తలు, వ్యవసాయ శాఖ అధికారుల అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడాడారు. రైతుని రాజు చేయాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమన్నారు.
ప్రభుత్వం సూచించినట్లు గా పంటలు వేసి రైతులు లాభాలు పొందాలన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్, రైతు బంధు సమితి రాష్ట్ర చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఏ మంచి పని తలపెట్టినా కొందరు విమర్శిస్తున్నారు. దొంగలే దొంగ దొంగ అన్నట్లుగా ఉందన్నారు. రైతులకు కావాల్సినవి సీఎం కేసీఆర్ చేస్తున్నారని తెలిపారు. పోతిరెడ్డిపాడుకు పొక్కలు పెట్టింది కాంగ్రెస్ టీడీపీ పార్టీలే అన్నారు. తెలంగాణకు అన్యాయం చేసింది కూడా ఆ రెండు పార్టీలే అని విమర్శించారు.