telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణలో ఏడాది పూర్తి చేసుకున్న కరోనా : ఈటల కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో గతేడాది ఇదే రోజున తొలి కరోనా కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ మంత్రి ఈటల కీలక వ్యాఖ్యలు చేశారు. గతేడాది దుబాయ్ నుండి తొలి కరోనా కేసు వచ్చింది ఈ రోజేనని ఈటెల రాజేందర్ అన్నారు. అనేక రకాల సందేహాలు, అనుమానాలు ఉండేనని.. గాంధీ హాస్పిటల్ లో అని రకాల సిబ్బంది ఆత్మ విశ్వాసంతో పని చేశారని కొనియాడారు. 35 వేలకు పైగా కోవిడ్ పేషెంట్స్ గాంధీలో చికిత్స పొందారని… అత్యధికంగా కోవిడ్ పేషెంట్స్ డెలివరీ ఇక్కడే జరిగిందన్నారు. ప్రాణాలకు తెగించి వైద్యులు కర్తవ్యం నిర్వహించారని.. వారి సేవలను గుర్తించి సన్మానం కూడా చేస్తున్నామని తెలిపారు. కరోనా కట్టడికి ఎన్నో కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం తీసుకుందని..విమానాలు, రైళ్లను అపమని మొదటగా చెప్పింది మన ముఖ్యమంత్రి కేసీఆరే అని గుర్తు చేశారు. మొదటగా లాక్ డౌన్ చేసి తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు. అనేక రాష్ట్రాలు సెకండ్ వేవ్ తో బాధ పడుతున్నాయని.. కానీ కరోనాను మనం కట్టడి చేయగలిగామని తెలిపారు. అందరికి వ్యాక్సిన్ ఇచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని… వందల సంఖ్యలో వ్యాక్సిన్ సెంటర్ లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి ఈటల.

Related posts