ధరణి పోర్టల్ నాన్ అగ్రికల్చర్ ప్రాపెర్టీ ల వివరాల నమోదుపై హై కోర్టు స్టే విధించింది. ధరణి పోర్టల్ లో భద్రత పరమైన అంశాలపై దాఖలైన పిటిషన్లపై నేడు హై కోర్టు లో విచారణ జరిగింది. ధరణిలో నాన్ అగ్రికల్చర్ ప్రాపెర్టీ వివరాలు నమోదు చేయద్దని ఆదేశాలు జారీ చేసింది. భద్రతాపరమైన నిబంధనలు పాటించకపోతే ఇబ్బందులు వస్తాయని హై కోర్టు పేర్కొంది. ప్లేస్టోర్ లో ధరణి పోర్టల్ తో పోలిన మరో 4 యాప్స్ ఉన్నాయని హై కోర్టు వెల్లడించింది. అసలు యాప్ ఏదో తెలుసు కోవడం ఇబ్బంది హై కోర్టు సూచించింది. రెండు వారాలలో కౌంటర్ దాఖలు చేయాలనీ ప్రభుత్వానికి హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా.. రెవెన్యూ సేవలను సులభంగా, పారదర్శకంగా అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ధరణి పోర్టల్‌ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గత వారం మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లిలో ప్రారంభించారు.