telugu navyamedia
Uncategorized

అమెరికా లోని ఆ రాష్ట్రంలో అర్ధరాత్రే పోలింగ్… ఎందుకంటే..?

యూఎస్ సంయుక్త రాష్ట్రాల్లో అధ్యక్షా ఎన్నికలు ప్రారంభం అయ్యాయి.  అమెరికా కాలమానం ప్రకారం ఒక్క రాష్ట్రం మినహా అన్ని రాష్ట్రాల్లో ఉదయం ఆరు గంటల నుంచే ప్రారంభం అవుతాయి.  ఉదయం ఆరు గంటల నుంచి ఆయా రాష్ట్రాల కాలమానాలు ప్రకారం ఓటింగ్ జరుగుతుంది.  అయితే, హాంప్ షైర్ రాష్ట్రంలో మాత్రం అర్ధరాత్రి నుంచే పోలింగ్ మొదలౌతుంది.  3 వ తేదీ తెల్లవారుజామునుంచే పోలింగ్ ప్రారంభం అవుతుంది.  1960 నుంచి ఆ రాష్ట్ర ప్రజలు ఇలానే ఓటు వేస్తున్నారు.  హాంప్ షైర్ రాష్ట్రంలో మూడు పట్టణాలు ఉన్నాయి.  అర్ధరాత్రి నుంచే అక్కడి ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు.  ఇప్పటికే రెండు పట్టాలను రిజల్ట్స్ వచ్చేశాయి.  డిక్స్ విల్లై నోచ్ లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 5 ఓట్లు డెమోక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ కు పడ్డాయి.  మరో టౌన్ మిల్స్ ఫీల్డ్ లో 16 ఓట్లు ట్రంప్ కు పడగా, జో బైడెన్ కు 5 ఓట్లు పడ్డాయి.  అయితే మరో టౌన్ హార్ట్స్ లొకేషన్ లో మాత్రం కరోనా దృష్ట్యా ఓటర్లు అర్ధరాత్రి కాకుండా ఉదయం 6 గంటల నుంచి పోలింగ్ లో పాల్గొన్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts