కోలివుడ్ స్టార్ హీరో ధనుష్ రఘువరన్ బీటెక్’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను దగ్గరైన ఆయన…తొలిసారిగా తెలుగు సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేశారు. తమిళంలో విపరీతమైన క్రేజ్ ఉన్న ధనుష్‌కు తెలుగు సహా ఇతర భాషల్లోనూ అభిమానులున్నారు.
తాజాగా దనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి ‘సార్’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఖరారు చేశారు మూవీ మేకర్స్ . సంయుక్త మేనన్ హీరోయిన్గా నటిస్తోంది. తె తమిళంలో ‘వాతి’అనే టైటిల్‌తో తెరకెక్కుతుంది.
సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై నిర్మించనున్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ విషయాలను తెలియజేస్తూ మేకర్స్ ఓ మోషన్ పోస్టర్ని విడుదల చేశారు. టైటిల్ ను బట్టి చూస్తుంటే ఈ సినిమాలో ధనుష్ టీచర్ గా కనిపించనున్నాడని తెలుస్తుంది.
కాగా, ధనుష్ ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. అత్రంగి రే అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే ఓటీటీ వేదికగా విడుదల కానుంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సారా అలీఖాన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. అక్షయ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మరోవైపు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేయనున్నాడు.