telugu navyamedia
తెలంగాణ వార్తలు

స్మార్ట్ సిటీ కోసం రాష్ట్ర వాటా ఇవ్వని కేసీఆర్ సర్కార్: బండి సంజయ్ కుమార్

నగరాలు ఆకర్షణీయంగా ఉండాలన్న గొప్ప ఆలోచనతో ప్రధాని నరేంద్ర మోడీగారు స్మార్ట్ సిటీ ని తీసుకొస్తే రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో పథకం ఉద్దేశం నీరుగారి పోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆరోపించారు.

కేంద్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రి శ్రీ హారదీప్ సింగ్ పూరీ తో సంజయ్ భేటీ అయి రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్ల స్మార్ట్ సిటీ పనుల్లో జరుగుతున్న జాప్యాన్నీ వివరించారు. కరీంనగర్ కు రూ.196 కోట్లు, వరంగల్ లకు రూ. 196 కోట్ల ను స్మార్ట్ సిటీ కింద కేంద్రం విడుదల చేస్తే రాష్ట్రం దారి మళ్లించిందని సంజయ్ అన్నారు.

గతం లో హైదరాబాద్ లో జరిగిన అర్బన్ డెవలప్మెంట్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో తాను నిధుల దారి మల్లింపు పై రాష్ట్ర అధికారుల్ని నిలదీయగా వాళ్ళు నీళ్లు నమిలారని, ఇటీవల ఆ నిధుల్ని స్మార్ట్ సిటీ పనులకు విడుదల చేశారని ఆయన చెప్పారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ నిధుల్ని మాత్రం విడుదల చేయలేదని సంజయ్ వివరించారు.

అధికారులపై తీవ్ర వత్తిడి తేగా కేవలం కొన్ని నిధులు మాత్రమే విడుదల చేశారని సంజయ్ ఆరోపించారు. మిగతా వాటి విషయం లోరాష్ట్రం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండ తాత్సారం చేస్తోంది అన్నారు.ఇక పనుల విషయం లోనాణ్యత లేదని సంజయ్ అన్నారు. పైగా ప్రణాళిక లేకుండా పనులు చేస్తున్నారని చెప్పారు. ఇక కాంట్రాక్టర్ల కోసమే పనులు చేస్తున్నట్లు ఉందని సంజయ్ చెప్పారుతర్వాత స్మార్ట్ సిటీ ప్రాజెక్టు డైరెక్టర్ కునాల్ కుమార్ తో సంజయ్ భేటీ అయ్యారు.

Related posts