telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

హోలీ మూడు రోజులు లాక్ డౌన్…

Delhi

మన దేశంలో ఓ వార్పు కరోనా వ్యాక్సినేషన్ జరుగుతూనే ఉన్న కేసులు మాత్రం తగ్గడం లేదు. రోజుకు వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే ముఖ్యంగా దేశరాజధాని ఢిల్లీలో మరోసారి కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కరోనా సోకిన ప్రముఖల జాబితాలో లోకసభ స్పీకర్‌ ఓం బిర్లా, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీర్ధసింగ్ రావత్ కూడా చేరిపోయారు.. రోజురోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యతో ఢిల్లీ సర్కార్ అప్రమత్తం అయ్యింది.. హోలీ సందర్భంగా ఈనెల 28, 29, 30 తేదీలలో కఠిన నిబంధనలతో ఆంక్షలు విధించాలనే యోచనలో ఉంది అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం.. ఆ మూడు రోజుల పాటు “లాక్ డౌన్” విధించాలని ఆరోగ్యశాఖ అధికారులు సూచించారు. అయితే కేవలం ఢిల్లీలో మాత్రమే కాకుండా కరోనా కేసులు మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు రాష్ట్రలో కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి.

Related posts