బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే బాలీవుడ్ మీడియాపై ఫైర్ అయ్యారు. యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘చపాక్’ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో దీపిక ప్రస్తుతం బిజీగా ఉంది. పలు రియాలిటీ షోలకు, మీడియా ఇంటర్వ్యూలకు హాజరవుతూ తన సినిమాను ప్రమోట్ చేసుకుంటోంది. ఆదివారం జరిగిన ఓ ప్రమోషన్ కార్యక్రమంలో దీపిక మాట్లాడుతుండగా.. ఓ విలేకరి.. “మీరు గర్భవతి అయ్యారట కదా?” అని ప్రశ్నించారు. దీంతో దీపికకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. “ఏంటి? నేను గర్భవతిలా కనిపిస్తున్నానా? నేనెప్పుడు తల్లిని కావాలో మీరే చెప్పండి. మీరు అనుమతిస్తే మేం పిల్లల గురించి ప్లాన్ చేసుకుంటాం. నిజంగా నేను గర్భవతిని అయితే అందులో దాచాల్సింది ఏముంది? అందరికీ కనబడుతుంది కదా” అని సమాధానం ఇచ్చింది.
							previous post
						
						
					
							next post
						
						
					

