సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ “అర్జున్ రెడ్డి” సినిమాతో తెలుగుతోపాటు అన్ని భాషల్లోనూ క్రేజ్ ను సంపాదించుకున్నారు. ఆయన తాజా చిత్రం “డియర్ కామ్రేడ్”. ఈ చిత్రం ఇటీవలే నాలుగు దక్షిణాది భాషల్లో విడుదలైన మిశ్రమ స్పందనను తెచ్చుకుంది. తాజాగా విజయ్, డాషింగ్ డైరెక్టర్ పూరి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’తో సూపర్ హిట్ అందుకున్న పూరీ ఓ సూపర్ క్రేజీ పాత్రను విజయ్ కోసం డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో విజయ్ ఆ పాత్రలో అలరించనున్నారని టాక్. సరిగా పలకలేని వ్యక్తిగా నటించనున్నాడని టాక్. ఈ విషయాన్ని ఛార్మి అధికారికంగా ప్రకటించింది. ఈ మధ్య కాలంలో తెలుగు హీరోలు వైవిధ్యమైన పాత్రలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. రామ్‌చరణ్ కూడా ‘రంగస్థలం’ సినిమాలో మాటలు వినపడని వ్యక్తి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అలాగే రవితేజ కూడా ‘రాజాదిగ్రేట్’ సినిమాలో కళ్లు కనపడని వ్యక్తిగా నటించాడు. అంతేకాకుండా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ‘జైలవకుశ’ చిత్రంలో మాటలు సరిగా పలకలేని వ్యక్తిగా నటించి అదరగొట్టిన సంగతి తెలిసిందే.
next post

