telugu navyamedia
సినిమా వార్తలు

“మహానాయకుడు”పై వర్మ కామెంట్… రానా రిప్లై

Rana-and-Ram-Gopal-Varma

దివంగత నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ రెండవ భాగం “మహానాయకుడు” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా “మహానాయకుడు”లో చంద్రబాబు నాయుడు పాత్ర పోషిస్తున్న రానాకు సంబంధించిన ఫోటోలను విడుదల చేశారు. మరోవైపు ఈ సినిమాకు గట్టిపోటీనిస్తున్న “లక్ష్మీస్ ఎన్టీఆర్” కూడా విడుదలకు సిద్ధమవుతోంది. మార్చి మొదటివారంలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రేక్షకులు కూడా “మహానాయకుడు” కంటే “లక్ష్మీస్ ఎన్టీఆర్”పైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా వర్మ చంద్రబాబు నాయుడు పాత్రలో ఉన్న రానా ఫోటోను ఉద్దేశిస్తూ “చంపేశావ్ రానా… నిజానికి మించి నీ రూపు కన్పిస్తోంది” అంటూ రానా ఫోటోను పోస్ట్ చేశారు. 

Related posts