telugu navyamedia
క్రైమ్ వార్తలు

కలిసే వచ్చాం … కలిసే వెళ్లిపోతాం … కవలలనూ వదలని కరోనా

twins

కరోనా మహమ్మారి సృష్టిస్తున్న విలయం అంతా ఇంతా కాదు. చైనాలో పుట్టి ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ మహమ్మారి ఎవ్వరినీ వదలటం లేదు. నిస్వార్థంతో కరోనా రోగులకు సేవలందిస్తున్న వైద్యులు, నర్సులు, ఇతరాత్ర వైద్య సిబ్బంది సైతం కరోనా బారినపడి చనిపోతున్నారు. బ్రిటన్‌లోని ఓ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో నర్సులుగా పనిచేస్తున్న 37 ఏళ్ల ఎమ్మా డెవిస్, కేటీ డెవిస్ అనే కవల సోదరీమణులకు సైతం కరోనా సోకింది. సౌతాంఫ్టన్‌ జనరల్ హాస్పిటల్‌లో చేరిన ఎమ్మా, కేటీలు గత కొద్ది రోజులుగా కరోనా వైరస్‌కు చికిత్స అందుకుంటున్నారు. అయితే, కొద్ది రోజుల కిందట ఎమ్మా చనిపోయింది. ఆమె చనిపోయిన నాలుగు రోజులకే కేటీ కూడా ప్రాణాలు విడిచింది. ఎమ్మాను స్మరిస్తూ ఆ హాస్పిటల్ సిబ్బంది ప్రధాన ద్వారం వద్ద చప్పట్లు నివాళులు అర్పించిన గంటలోనే కేటీ కూడా చనిపోవడం గమనార్హం. ఈ ఘటనపై ఆ కవలల సోదరి జాయ్ మాట్లాడుతూ.. మేమిద్దరం ఈ ప్రపంచానికి కలిసే వచ్చాం. కలిసే వెళ్లిపోతామని ఎప్పుడూ అనేవారు. ఒకరి కోసం ఒకరు జీవించేవాళ్లు. ఇద్దరూ ఏ రోజు విడిపోయి జీవించలేదు. కేవలం కరోనా మాత్రమే వారిని విడదీసింది. అని కన్నీరుమున్నీరైంది. వారు ఇకలేరని తెలిసి తోటి వైద్య సిబ్బంది సైతం జీర్ణించుకోలేకపోతున్నారు.

Related posts