కళ్ళు తిరిగి ప్రమాదవశాత్తు బావిలో పడిన వృద్ధురాలి ప్రాణాలు కాపాడారు అరండల్ పేట కానిస్టేబుల్. ఈ ఘటన గుంటూరు బ్రాడీపేటలో జరిగింది.
సిద్ధార్థ నగర్ కు చెందిన రమాదేవి అనే వృద్ధమహిళ వైద్యం కోసం క్లినిక్ కి వచ్చింది . అయితే హాస్పిటల్ ఆవరణలో కళ్ళు తిరిగి పోవడంతో ప్రమాదవశాత్తు పక్కనే వున్న బావిలో పడిపోయింది.
గమనించిన స్థానికులు వెంటనే అరండల్ పేట పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకుని హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నకానిస్టేబుల్ ఆమెని రక్షించారు. బావిలోకి దిగి వృద్ధమహిళను బయటికి తీసి .. వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు.