ఏపీసీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ముఖ్య ప్రజా సంబంధాల అధికారి(సీపీఆర్వో)గా సీనియర్ జర్నలిస్ట్ పూడి శ్రీహరి నియమితులయ్యారు. విశాఖపట్నంలో పాత్రికేయుడిగా తన వృత్తిని ప్రారంభించిన శ్రీహరి, గడచిన 19 ఏళ్లుగా జర్నలిస్టుగా కొనసాగుతున్నారు. పదేళ్లుగా సాక్షిటీవీలో వివిధ హోదాల్లో పనిచేశారు. చీఫ్ న్యూస్ కో-ఆర్డినేటర్‌గా, ఇన్‌పుట్ ఎడిటర్‌గా పలుకీలక బాధ్యతలు నిర్వహించారు. యాంకర్‌గా అనేక చర్చా కార్యక్రమాలను నిర్వహించారు. అంతకుముందు ఆయన ఈనాడు, ఈటీవీ సంస్థల్లో పనిచేశారు. క్షేత్రస్థాయి సమాచార సేకరణ, విశ్లేషణలో శ్రీహరికి విశేష అనుభవం ఉంది. అనేక అసైన్‌మెంట్లను సమర్థవంతంగా నిర్వర్తించారు. గత రెండేండ్లుగా వైఎస్ జగన్ మీడియా వ్యవహారాలు చూస్తున్నారు.
14 నెలలు పాటు 3,648 కిలోమీటర్లు సాగిన జగన్ సుదీర్ఘ పాదయాత్రలో తొలిరోజు నుంచి చివరి రోజు వరకూ కొనసాగారు. నియోజకవర్గాలకు సంబంధించి క్షేత్రస్థాయి సమాచార సేకరణ, అధ్యయనం, మీడియా వ్యవహారాల బాధ్యతలను గొప్పగా నిర్వహించారు. జగన్ రాజకీయ ప్రస్థానం, పాదయాత్రలను ప్రధాన అంశాలుగా చేసుకుని సమగ్ర వివరాలతో ”అడుగడుగునా అంతరంగం” అనే పుస్తకం కూడా రాశారు. ఎన్నికలకు ముందు ఈ పుస్తకాన్ని జగన్ ఆవిష్కరించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా విభాగాల్లో శ్రీహరికి విశేషం అనుభవం ఉంది. వార్త పుట్టక నుంచి దాని ప్రసారం, ప్రచురణ అయ్యేంత వరకూ జరిగే ప్రక్రియలన్నింటిపైనా ఆయనకు పట్టు ఉంది. పనిలో రాజీపడరని, అసైన్ మెంట్‌ను అనుకున్న దానికంటే ముందుగా పూర్తిచేస్తారని, అదే కెరీర్ పరంగా ఆయన్ని ముందుకు తీసుకెళ్లిందని అంటుంటారు. ఇవన్నీ వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్రకు ఉపకరించాయని, జగన్ విశ్వాసాన్ని చూరగొన్నారని సన్నిహితులు చెబుతున్నారు.
కర్ణాటక ప్రభుత్వం కూలిపోతుంది: యెడ్యూరప్ప