telugu navyamedia
ఆంధ్ర వార్తలు

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..

శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ తెలియ‌జేసింది.. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సర్వదర్శనాలు పునఃప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం నుంచి టైంస్లాట్‌ సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నారు. భక్తుల నుంచి విజ్ఞప్తులు వస్తున్న నేపథ్యంలో టీటీడీ ఈమేరకు నిర్ణయం తీసుకుంది.

అయితే ముందుగా చిత్తూరు జిల్లా భక్తులకు మాత్రమే సర్వదర్శనం అవకాశం కల్పించింది. రోజుకు రెండు వేల చొప్పున టికెట్లు ఇస్తున్నారు. శ్రీనివాసం కౌంటర్లలో టికెట్లు జారీచేస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. త్వరలోనే మిగతా జిల్లాల వారికి కూడా టోకెన్లు జారీ చేస్తామని టీటీడీ తెలిపింది.

Sarvadarshanam : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్-సర్వదర్శనం టోకెన్లు జారీ |  Sarvadarshanam

కరోనా దృష్ట్యా ఏప్రిల్‌ 11 నుంచి సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేశారు. కేవలం రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న భక్తులు, సిఫార్సు లేఖల ద్వారా వచ్చే భక్తులను మాత్రమే పరిమిత సంఖ్యలో అనుమతించారు. గతంలో నిత్యం 8 వేల సర్వదర్శనం టికెట్లను జారీచేసేవారు.

గతంలో రోజూ 8 వేల సర్వదర్శనం టికెట్లను టీటీడీ జారీ చేయగా.. తాజాగా రోజుకు 2 వేల చొప్పున సర్వదర్శనం టోకెన్లను విడుదల చేయనుంది.

Darshan for common devotees resumes at Tirumala temple - DTNext.in

కాగా, సెప్టెంబర్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి వర్చువల్ ఆర్జిత సేవా టిక్కెట్లు కోటాను ఆగష్టు 24వ తేదీన టీటీడీ విడుదల చేసింది. tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌లో, గోవిందా యాప్‌ల ద్వారా టికెట్లు బుక్‌ చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. ఆన్‌లైన్‌ 8వేల టికెట్లను అందుబాటులో ఉంచింది.

Related posts