telugu navyamedia
తెలంగాణ వార్తలు

వివాదంలో తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌.. ఖమ్మంలో వింత పూజలు

*పూనకంతో ఊగిపోయిన మహిళా ఎంపీపీ చుట్టూ డిహెచ్ శ్రీనివాస్ ప్రదక్షిణలు

*మంటల్లో మిరపకాయలు, నిమ్మ‌కాయ‌లు వేస్తూ వింత‌పూజ‌లు

*బంజారా గిరిజ‌న దేవ‌త పూజ‌కు హాజ‌ర‌య్యా..

*నేను హోమానికే దండం పెట్టా..వ్య‌క్తికి కాదు..
*హెల్త్ డైరెక్ట‌ర్‌గా ఉన్న నాకెందుకు రాజ‌కీయాలు..

తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ వివాదంలో చిక్కుకున్నారు. దేవుడు కరుణించాలంటూ ఖమ్మంలో వింత పూజలు నిర్వహించారు. మంటల్లో మిరపకాయలు వేస్తూ పూజలు చేశారు. తనను తాను దేవతగా ప్రకటించుకున్నఆర్‌ఎస్‌ ఎంపీపీ చుట్టూ ప్రదక్షిణలు చేశారు. 

అయితే సైన్స్‌ బోధించాల్సిన డీహెచ్‌ ఇలాంటి పూజలు చేయడం ఏంటని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ ఎంట్రీ కోసమే క్షుద్ర పూజలంటూ ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా కొత్తగూడెంలో డీహెచ్‌ విస్తృతంగా పర్యటిస్తున్నారు.

ఈ క్ర‌మంలో తనపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో డీహెచ్‌ స్పందించారు. .తమ స్వస్థలం కొత్తగూడెం ప్రాంతంలో హెల్త్‌ క్యాంప్‌ నిర్వహించేందుకు అక్కడకు వెళ్లినట్లు తెలిపారు. అయితే బంజారా కమ్యూనిటీ వాళ్లు తమ కుల దేవతకు పూజలు చేస్తున్నారని చెబితే ఆ కార్యక్రమంలో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. తాను హోమానికి దండం పెట్టానని, వ్యక్తికి కాదని చెప్పుకొచ్చారు. రాజకీయాలతో తనకు సంబంధం​ లేదని తెలిపారు.

 ఆ మహిళ ప్రజా ప్రతినిధి అన్న విషయం తెలుసు కానీ ఆమె దేవతగా ప్రకటించుకున్నట్లు తెలీదన్నారు. అంతేగాక తాను చేస్తున్న సేవా కార్యాక్రమాలు గిట్టని వారు స్థానిక రాజకీయ నేతలతో కలిసి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

Related posts