telugu navyamedia
రాజకీయ వార్తలు

దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ బ‌ల‌హీనంగా ఉంది: సోనియా

soniya gandhi

కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్య‌క్షురాలు సోనియా గాంధీ ఇవాళ ఆ పార్టీ నేత‌ల‌తో ఢిల్లీలో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ మ‌రీ బ‌ల‌హీనంగా ఉంద‌న్నారు. ఆర్థిక వ్య‌వ‌స్థ దివాలాతీయడంతో న‌ష్టాల ఊబి పెరుగుతోంద‌న్నారు. ప్ర‌జాస్వామ్యం పెను ప్ర‌మాదంలో ఉంద‌న్నారు. కానీ ప్ర‌భుత్వం మాత్రం కేవ‌లం రాజ‌కీయ క‌క్ష్య‌సాధింపుపైనే దృష్టి పెట్టింద‌ని సోనియా అన్నారు.

ప్ర‌జలు ఇచ్చిన అధికారాన్ని ప్ర‌భుత్వం దుర్వినియోగం చేస్తుంద‌న్నారు. అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన రీతిలో ప్ర‌జాతీర్పును నిర్వీర్యం చేస్తున్నార‌ని సోనియా ఆవేద‌న వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది. గాంధీ, ప‌టేల్‌, అంబేద్క‌ర్ లాంటి నేత‌ల‌పై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌న్నారు.ఈ సమావేశంలో ఆన్ని రాష్ట్రాల నేతలు పాల్గొన్నారు. ముఖ్యంగా కర్నాటక రాజకీయ పరిస్తితుల పై చర్చించినట్టు తెలుస్తోంది. కర్నాటక విపక్ష నేత ఎంపిక కోసం ఆ రాష్ట్ర నేతలతో చర్చినట్టు సమాచారం.

Related posts