telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

రష్యా వ్యాక్సిన్ పై మరికొంత పరిశీలన అవసరం: అమెరికా నిపుణుడు

Corona Virus Vaccine

ప్రపంచంలోనే తొలిసారిగా కరోనాకు వ్యాక్సిన్ తయారు చేశామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వీపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పించారు. తాజాగా రష్యా వ్యాక్సిన్ పై అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంనీ ఫాసీ స్పందించారు. . అమెరికాలోని ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ రష్యా వ్యాక్సిన్ పై మరికొంత పరిశీలన అవసరమని స్పష్టం చేశారు.

కరోనా వ్యాక్సిన్ వస్తే ఒక్క ఏడాదిలో పరిస్థితి మారిపోతుందని, కరోనా కారణంగా ఉత్పన్నమైన పరిస్థితులన్నీ సర్దుకుంటాయని అభిప్రాయపడ్డారు. అయితే నమ్మదగిన వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలంటే మరికొంత సమయం పడుతుందని, 2021 ఆరంభంలో కరోనా వ్యాక్సిన్ వస్తుందని భావిస్తున్నామని తెలిపారు. మానవులు అంటువ్యాధులపై పూర్తిస్థాయి ఆధిపత్యం సాధించిన సందర్భాలు చాలా తక్కువని అన్నారు. గతంలో అమ్మవారు వ్యాధిపై మాత్రమే మానవులు పైచేయి సాధించారని, మిగతా వ్యాధులను మాత్రం అదుపులో ఉంచగలిగారని ఫాసీ వివరించారు.

Related posts