telugu navyamedia
క్రీడలు వార్తలు సామాజిక

ఎంఎస్ ధోనీ ఎవరెస్ట్ శిఖరం..రవిశాస్త్రి ప్రశంసలు

ravi shastri coach

టీమిండియా క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంటు ప్రకటించడంతో క్రీడాలోకం నివ్వెరపోయింది. ఈ నేపథ్యంలో కోచ్ రవిశాస్త్రి స్పందించారు. ఏ విధంగా చూసినా ఎంఎస్ ధోనీ ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తైన వాడని కొనియాడారు. ధోనీ తనదైన శైలిలో అంతర్జాతీయ కెరీర్ ముగించాడు. సూర్యుడు అస్తమించడంతో మన స్వాతంత్ర్య దినం ముగిసినట్టయింది… అదే సమయంలో ధోనీ కూడా తన ప్రస్థానానికి వీడ్కోలు పలికాడు.

క్రికెట్ లో నికార్సయిన బాద్ షా అంటే ధోనీనే. ఎంతో ఒత్తిడి సమయాల్లోనూ ప్రశాంతంగా, నిగ్రహంతో ఉండడం ధోనీకే సాధ్యం. మ్యాచ్ ను అంచనా వేయడంలో దిట్ట. ఓ నాయకుడిగా, జట్టు కెప్టెన్ గా ధోనీ ఎవరెస్ట్ శిఖరం ఎత్తుకు ఎదిగాడు. అన్ని ఫార్మాట్లలో వరల్డ్ కప్పులు, చాంపియన్స్ ట్రోఫీ, టెస్టుల్లో నెంబర్ వన్ ర్యాంకు, ఐపీఎల్ టైటిళ్లు, చాంపియన్స్ లీగ్ అన్ని ధోనీ కీర్తికిరీటంలో చేరాయి. ఈ రిటైర్మెంట్ అనంతరం ధోనీ, సాక్షి, జివా అందరూ ఎంతో సంతోషమ ప్రశాంత జీవనం గడపాలని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు.

t

Related posts