మనిషి క్రూరత్వానికి ప్రతీకలాంటి ఘటన ఆస్ట్రేలియాలో వెలుగుచూసింది. ఓ ఇంటి తోటలో రక్తపుమడుగులో పడి ఉన్న ఓ చిలుకను ఆ ఇంటి యజమాని దగ్గరలోని పశువుల ఆస్పత్రికి తరలించాడు. కుకుటూ జాతికి చెందిన ఆ చిలుక తెల్లగా ఉంటుందని, తన కంటపడేసరికి దాని శరీరం అంతా రక్తంతో తడిచిపోయి ఉందని అతను చెప్పాడు. దానికి తగిలిన దెబ్బలను పరిశీలించిన వైద్యులు అవాక్కయ్యారు. ఎక్స్‌రే తీయగా.. దాని శరీరంలో 5 పాలెట్స్ (రబ్బర్ బుల్లెట్లలాంటివి) కనిపించాయి. ఈ తూటాలు చిలుక భుజాలు, తలలో దిగడంతో తీవ్రరక్తస్రావం అయింది. ఈ ఎక్స్‌రేను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా క్షణాల్లోనే వైరలయింది. ఈ గుళ్లు రెండు గన్నుల నుంచి వచ్చినట్లు వైద్యులు తెలిపారు. చిన్నచిలుకను ఎందుకు చంపాలనుకున్నారో తెలియడంలేదన్నారు. ఓ తూటా చిలుక ఎడమ కంటికి చాలా దగ్గరగా దిగిందని చెప్పారు. ఇంత క్రూరంగా దాన్ని చంపడానికి ప్రయత్నించినా కూడా ఆ చిలుక బతికిందని వెల్లడించారు. దాని శరీరంలో కొన్ని తూటాలను తీయడం కుదరలేదని, కానీ దానివల్ల చిలుకకు ఎటువంటి ఇబ్బందీ ఉండదని వివరించారు. మరికొన్ని రోజుల్లో ఆ పిట్ట చక్కగా ఆకాశంలో చక్కర్లు కొడుతుందని హామీ ఇచ్చారు.
పరిపాలించడం చేతకాకే… బీజేపీపై టీఆర్ఎస్ విమర్శలు: బాబు మోహన్