telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

షూటింగ్ షురూ చేసిన మహేష్… కానీ సినిమా కోసం కాదట…!

Mahesh

కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ లో భాగంగా సినిమా షూటింగ్ లు నిలిచిపోవడంతో నటీనటులంతా ఇళ్ళకే పరిమితమయ్యారు. ఇందులో భాగంగా ఇటీవలే సినిమా, టీవీ సీరియళ్ల షూటింగ్‌లకు అనుమతి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే సినిమా షూటింగ్ జరిగే సమయంలో లొకేషన్‌లో ఎవరెవరు ఎలా ఉండాలో చెబుతూ కొన్ని గైడ్‌లైన్స్‌ను కేంద్రం విడుదల చేసింది. షూటింగ్ లొకేషన్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలని, అలాగే అందరూ విధిగా మాస్క్ ధరించాలని కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. కెమెరా ముందు నటించే నటీనటులు తప్పితే మిగిలిన వారందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని తెలిపారు. దీంతో ఇప్పుడిపుడే మళ్ళీ టాలీవుడ్ సినిమా షూట్స్ ప్రారంభమవుతున్నాయి. ఇక తాజాగా సూపర్ స్టార్ మహేష్ కూడా ఈ రోజు షూటింగ్ ప్రారంభించారు. అందుకోసం ఆయన సెట్స్ కు వెళ్లిన ఫోటోను మహేష్ బాబు టీం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది. అయితే అది సినిమా షూటింగ్ కాదు. మహేష్ బాబు ఓ యాడ్ షూటింగ్ కోసం బయటకు వచ్చాడు. యాడ్ షూటింగ్ ప్రారంభించిన మహేష్ త్వరలోనే సినిమా షూట్ కూడా స్టార్ట్ చేస్తారు అని తెలుస్తుంది. ఇక మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ అనే సినిమాను మహేష్ చేస్తున్న విషయం తెలిసిందే.

Related posts