telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఒంగోలులో ఆర్టీఏ అధికారుల ఓవరాక్షన్‌పై సీఎం జగన్‌ సీరియస్‌..

ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో ఆర్టీఏ అధికారుల ఓవరాక్షన్‌పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీఏ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

బుధవారం రాత్రి వినుకొండ నుంచి తిరుమల వెళ్తున్న ఓ కుటుంబం టిఫిన్ కోసం ఒంగోలులో ఆగింది. అక్కడికి వచ్చిన ఓ కానిస్టేబుల్ ఈ నెల 22న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఒంగోలు పర్యటనకు కాన్వాయ్ కావాలంటూ వాహనాన్ని, డ్రైవర్‌ను తీసుకెళ్లాడు. దీంతో ఆ కుటుంబం రాత్రంతా తీవ్ర ఇక్కట్ల ప‌డ్డారు.

ఈ ఘటనపై మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ విషయాన్ని సీఎం వైఎస్ జ‌గ‌న్ సీరియస్ గా తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఇవాళ ఆదేశించారు.

సీఎం ఆదేశాల మేరకు ఒంగోలులో తిరుపతికి వెళ్లే ప్రయాణీకుల నుండి వాహనం తీసుకెళ్లిన ఏఎంవీఐ సంధ్య, హోంగార్డు తిరుపతిరెడ్డిలపై సస్పెన్షన్వేటు వేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు.

Related posts