telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

ప్రభుత్వఆసుపత్రులను కార్పొరేట్‌ఆస్పత్రులకు దీటుగా తీర్చిదిద్దాలి: జగన్‌

తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంతో నేడు కోవిడ్‌ నియంత్రణ, వైద్యరంగంలో నాడు-నేడుపై సమీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌తో పాటు సమావేశంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. పెళ్లిల్లో 150 మంది మాత్రమే ఉండాలి.45 ఏళ్లకు పైబడ్డవారు, గర్భవతుల తర్వాత టీచర్లకు వ్యాక్సినేషన్‌లో అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆగస్టు 16వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా టీచర్లకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తిచేయాలని తెలిపారు. కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ను తప్పనిసరిగా పాటించేలా చూడాలని స్పష్టం చేశారు. ఎక్కడా కూడా పెద్ద ఎత్తున జనం గుమిగూడకుండా చూడాలని సూచించారు. కోవిడ్‌ నివారణ చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి’’ అని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు.

వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జోరుగా సాగేంతవరకూ జాగ్రత్తలు తప్పనిసరని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. రెండు నెలలపాటు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంటింటీ సర్వే కొనసాగాలని, లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు చేయాలని, 104 నంబర్‌ యంత్రాంగం సమర్థంగా సేవలందించేలా నిరంతరం పర్యవేక్షణ, సమీక్ష చేయాలని సూచించారు. ఈ తరాలకే కాదు, భవిష్యత్‌ తరాలకు కూడా అత్యుత్తమ వైద్యం ప్రజలకు అందాలన్నదే మా కల. ప్రభుత్వ ఉద్యోగి కూడా వైద్యం కోసం ప్రభుత్వ ఆస్పత్రులను ఎంపికచేసుకునేలా వాటిని తీర్చిదిద్దాలి. ఎల్లప్పుడూ కూడా ఈ మెడికల్‌ కాలేజ్‌ ఆస్పత్రులు కొత్తగా కనిపించాలి. అత్యంత నాణ్యమైన, సమర్థవంతమైన సేవలు అందాలి. కార్పొరేట్‌ఆస్పత్రులకు దీటుగా వీటిని నిర్వహించాలి. అందుకు తగ్గ ఎస్‌ఓపీలను తయారు చేయండి. ఎలా నిర్వహిస్తామో పద్ధతులను తయారు చేసి నాకు సమర్పించండి’’ అని అధికారులకు సీఎం జగన్‌ తెలిపారు.

Related posts