telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పాలనా సంస్కరణల్లో భాగంగానే వినూత్న చట్టాలు: కేసీఆర్

KCR cm telangana

ప్రజలకు చెందిన ప్రతి అంగుళం ఆస్తిని ఆన్‌లైన్‌లో నమోదు చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. మున్సిపల్‌ కార్పొరేషన్లలోని ఎమ్మెల్యేలు, మేయర్లతో కేసీఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విప్లవాత్మక పాలనా సంస్కరణల్లో భాగంగానే వినూత్న చట్టాలు తీసుకొచ్చినట్లు వివరించారు.

నూతన చట్టాల అమలు కోసం ప్రజా ప్రతినిధులు శ్రమించాలని సూచించారు. నూటికి నూరు శాతం ప్రజలే కేంద్ర బిందువని తెలిపారు.  కొత్త చట్టాల అమల్లో నిరుపేదలకు బాధ కలగకుండా చూడాలని అధికారులకు సీఎంఆదేశించారు. చట్టాల ఫలితాలు చివరి గుడిసె వరకు అందేలా చూడటమే లక్ష్యమని చెప్పారు. చట్టాలను కార్యాచరణలో పెట్టాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులు, అధికారులదేనని పేర్కొన్నారు.

Related posts