telugu navyamedia
తెలంగాణ వార్తలు

రోశయ్యకు కేసీఆర్ నివాళి..

ఆంధ్రప్రదేశ్ మాజీముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య పార్థివదేహానికి తెలంగాణ ముఖ్యమంత్రికేసీఆర్ పుష్పగుచ్ఛాన్ని సమర్పించి నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రివర్గ పరివారంతో రోశయ్య నివాసం చేరుకుని భౌతికకాయానికి పుష్పగుచ్చాలను సమర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖమంత్రి హరీశ్ రావు, గ్రామీణ అభివృద్ధిశాఖ మంత్రి ఎరబెల్లి దయాకర్ రావు, సినిమాటో గ్రఫీ మంత్రి తలసానిశ్రీనివాసయాదవ్, శ్రీనివాసగౌడ్ తదితరులున్నారు.

ఆంధ్రప్రదేశ్ మాజీముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు నివాళులు అర్పించారు. రాజకీయాల్లో రోశయ్య అనుసరించిన విధానం, భావితరాలకు ఆదర్శనీయమన్నారు. ఆర్థికమంత్రిగా, ముఖ్యమంత్రిగా పాలనలో తనదైన మార్కును సొంతం చేసుకున్నారన్నారు.

మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య పార్థీవ దేహానికి తెలంగాణ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వద్ద పుష్ప గుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. కొద్ది సేపు రోశయ్య కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని ఓదార్చారు. రోశయ్యతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రోశయ్య, పదవులకే వన్నె తెచ్చిన మంచి నాయకుడని పేర్కొన్నారు.

పదవి ఏదైనా, పని ఏదైనా, ప్రజల కోసం, అత్యంత నమ్మకంగా బాధ్యతాయుతంగా నిర్వహించారని గుర్తుచేశారు. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీ గా, మంత్రిగా, ముఖ్యమంత్రి గా, గవర్నర్ గా తమ పరిధి మేరకు ఆయా పదవుల్లో ఒదిగి పోయేవారని పేర్కొన్నారు. అనేక సమస్యలను తన అనుభవం, వాక్చాతుర్యంతో చక్కబెట్టిన అపర చాణిక్యుడని కొనియాడారు. ఉమ్మడి‌ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో సుదీర్ఘకాలం ఆర్థిక మంత్రిగా పనిచేశారని పేర్కొన్నారు.

Related posts