telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

యాదాద్రి అధికారులకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు…

Kcr telangana cm

కరోనా కారణంగా మూసేసిన యాదాద్రిని మళ్ళీ తెరవనున్నారు. అయితే ఇందుకు సంబంధించి ప్రగతిభవన్ లో సిఎం కెసిఆర్ సమీక్షించారు.  యాదాద్రి పుణ్యక్షేత్ర పునర్నిర్మాణ పనులు తుది రూపుదాలుస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దివ్యమైన అలంకృత రూపం ( ఆర్నమెంటల్ లుక్ ) కోసం కార్యాచరణ గురించి సిఎం ఆలయ అధికారులతో  ఈ సందర్భంగా చర్చించారు.  ఇటీవల యాదాద్రిలో పర్యటించి  క్షేత్రస్థాయిలో దేవాలయ ప్రాంగణాన్ని పరిసర ప్రాంతాలను కలియదిరిగి పలు సూచనలు  చేసిన నేపథ్యంలో పనుల పురోగతి ఎంతవరకు వచ్చిందనే విషయాలను సిఎం అడిగి తెలుసుకున్నారు.  దర్శనానికి వచ్చే భక్తుల కోసం  నిర్మిస్తున్న క్యూలైన్  నిర్మాణంలో చేపట్టాల్సిన అలంకరణ గురించి పలు సూచనలు చేశారు. 350 ఫీట్ల పొడవైన క్యూలైన్ నిర్మాణాన్ని ఇత్తడి డిజైన్లతో తీర్చిదిద్దాలన్నారు. క్యూలైను పొడవునా ప్రాకారం మీద బిగించే కలశపు నమూనాలను అధికారులు సీఎం ముందుంచారు.  వీటిని పరిశీలించిన మీదట నాలుగింటిలో ఒకదాన్ని సీఎం కేసీఆర్‌ ఖారరు చేశారు.  ఉత్తర దిక్కున వున్న ప్రహరీ గోడను తొలగించి, అక్కడ క్యూలైన్ నిర్మాణం చేపట్టాలని సూచించారు.

Related posts