telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

పెళ్లి కావడం లేదని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చిన యువకుడు…

marriage

ఓ వ్యక్తి తనకు పెళ్లి కావడం లేదని, 5 సంవత్సరాల నుండి సంబంధాలు చూస్తున్నా ఒక్కటి కూడా సెట్ కావడం లేదని చెప్పి పోలీసులను ఆశ్రయించాడు.  పబ్లిక్ సర్వీస్ కింద అమ్మాయిని వెతికి పెట్టాలని పోలీసులకు మొరపెట్టుకున్నాడు.  దీంతో పోలీసులు షాక్ అయ్యాడు.  అయితే, యువకుడు ఇచ్చిన ఫిర్యాదును తీసుకున్న పోలీసులు తాము ఏమి చేయగలమో అది చేస్తామని అన్నారు. అయితే గతంలో ఇదే యువకుడు పెళ్లి కావడం లేదని అప్పట్లో యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ను కలిశాడు.  అదే విధంగా కొన్ని నెలల క్రితం కైరానా సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ ను కలిశాడు.  రీసెంట్ గా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా లేఖ రాశాడట.  కానీ, ఎవరూ కూడా సరిగ్గా స్పందించకపోవడంతో ఈ పోలీస్ స్టేషన్ కు రావాల్సి వచ్చినట్టు యువకుడు అజీమ్ పేర్కొన్నారు.  ఐదేళ్లుగా సంబంధాలు చూస్తున్నా కుదరకపోవడానికి కారణం ఏమంటే అజీమ్ రెండు అడుగులకంటే కొద్దిగా ఎత్తు ఉంటాడు.  అందుకే ఎన్ని సంబంధాలు చూసినా సెట్ కావడం లేదు. చూడాలి మరి ఇతనికి పెళ్లి ఎప్పటికి అవుతుంది అనేది.

Related posts