వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేటితో 12వ ఏట అడుగుపెడుతుంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ట్విటర్ వేదికగా.. దేవుని దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో నేడు 12వ ఏట అడుగుపెడుతున్నామని తెలిపారు.
‘మేనిఫెస్టోయే భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించి ప్రతి ఇంటా విద్య, ఆర్థిక, సామాజిక విప్లవాలకు దారులు తీస్తున్నాన్నారు.
మన లక్ష్యాలు సాకారం అవుతున్నాయి.. మన విజయాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి!’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు.

