ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ పదవికి నన్నపనేని రాజకుమారి బుధవారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ హరిచందన్ కు పంపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం మారింది కాబట్టి నైతిక బాధ్యతగా రాజీనామా చేశారు. తన హయాంలో ఎందరో బాధిత మహిళలకు అండగా నిలిచానని చెప్పారు.
మూడేళ్ల రిపోర్టును గవర్నర్ కు అందజేశానని తెలిపారు. కుటుంబ వ్యవస్థ బలంగా ఉండాలని అప్పుడే నేరాలు తగ్గుతాయని చెప్పారు. నా నివేదికను చూసి గవర్నర్ అభినందించారు. రెండు నెలల ఆలస్యానికి మూడేళ్ల నివేదిక అడ్డంకిగా మారింది. నా హయాంలో బాధిత మహిళలకు అన్ని రకాలుగా అండగా నిలిచానని తెలిపారు. వసతి గృహాల్లో భద్రత పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో మాట్లాడడం లేదు: రేవంత్ రెడ్డి