కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో సీఎం జగన్ విడిగా సమావేశమయ్యారు. ప్రతిపక్షాల విమర్శలకు సరైన కౌంటర్ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతిపక్షాల విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పాలని మంత్రులను ఆదేశించారు. తీరు మార్చుకోకపోతే యాక్షన్ సీరియస్‌గా ఉంటుందన్న జగన్ ..కేబినేట్ లో మార్పులు చేసేందుకైనా సిద్ధమని జగన్ హెచ్చరించినట్లు తెలుస్తోంది.
ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ స్కాం ఆరోపణల వ్యవహారంపై ఎవరూ స్పందించకపోవడాన్ని కూడా జగన్ తప్పు పట్టినట్లు తెలిసింది.
దుష్టచతుష్టయం చేస్తున్న ఆరోపణలకు నాకేం పట్టిందని వ్యవహరించడం సరికాదని కూడా ఆయన అన్నారని చెబుతున్నారు. ఆరోపణలు వస్తున్నా చాలా మంది స్పందించడం లేదని ముఖ్యమంత్రి జగన్ కొందరు మంత్రుల పనితీరు పట్ల అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.
కాగా.. ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలోని బ్లాక్ వన్‌లో కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో 57 అంశాలకు అమోద ముద్ర పడింది.
రఫేల్పై చర్చ అంటే మోదీ పారిపోతున్నారు: రాహుల్