ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెగాసస్ అంశం తీవ్ర దుమారం రేపుతుంది. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న కాలంలో పెగాసెస్ సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేశారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సిన ఆరోపణలు ఏపీలో తీవ్ర కలకలం రేపుతోంది.
ఇటీవల ఏపీ అసెంబ్లీలో పెగాసెస్ చర్చ జరిగింది. ఈ సాఫ్ట్ వేర్ పై సమగ్రంగా విచారణ జరపించాల్సిన అవసరం ఉందని వైసీపీ సభ్యులు కోరారు. దీనిపై హౌస్ కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు.
ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో చివరి రోజైన శుక్రవారం నాడు టీడీపీ పెగాసెస్ వ్యవహారంపై స్పీకర్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారం హౌస్ కమిటీ వేశారు. ఈ కమిటీ చైర్మన్‌గా ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డిని నియమించారు.