telugu navyamedia
సినిమా వార్తలు

RRR సినిమా థియేటర్‌ వ‌ద్ద తుపాకీతో హల్‌చల్‌..తీరా చూస్తే..

*ఆర్ ఆర్ ఆర్ థియేటర్ వ‌ద్ద

ఓ అభిమాని తుపాకీతో హంగామా ..
*ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు న‌మోదు..
*విచారణలో తిర‌నాళ్ల లో బుడ‌గ‌లు కొట్టే ప్రీపిస్ట‌ల్ గా గుర్తింపు..
*ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా థియేటర్‌లో వ్యక్తి గన్‌తో హల్‌చల్‌

*పోలీసుల అదుపులో యువ‌కుడు ..

దర్శక ధీరుడు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్‌ మూవీ ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది. వేలాది సినిమా థియేటర్స్‌లో ఫ్యాన్స్ కోలాహలం కనిపిస్తోంది. ఈ సందర్భంగా థియేటర్లలో ఫ్యాన్స్‌ సందడి చేస్తుండగా ఓ వ్యక్తి మాత్రం గన్‌తో హల్చల్‌ చేశాడు.

.ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా అన్నపూర్ణా థియేటర్ వ‌ద్ద సినిమా ప్రారంభానికి ముందు థియేటర్ బయట గన్‌తో ఫోజులిచ్చాడు. అనంతరం ఆర్ఆర్ఆర్ సినిమా ప్రారంభమైన తర్వాత స్క్రీన్ ఎదుట నిలబడి అదే గన్ పట్టుకుని హంగామా సృష్టించాడు. దీంతో అక్కడున్న జనాలు భయ‌బ్రాంతుల‌కు గురైయ్యారు.

ఆ యువకుడు థియేటర్‌ బయట గన్‌తో తిరుగుతుండగా పోలీసులు గమనించి అదుపులోకి తీసుకున్నారు. అతడి దగ్గర ఉన్న తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో అది డమ్మీ తుపాకీ అని, తిర‌నాళ్ల లో బుడ‌గ‌లు కొట్టే ప్రీపిస్ట‌ల్ గా పోలీసులు తెలిపారు

Related posts