telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఢిల్లీకి వెళ్లొచ్చిన మంత్రులతో సీఎం కేసీఆర్ భేటీ..

మంత్రుల బృందం తెలంగాణ సీఎం కేసీఆర్ తో  భేటీ అయ్యారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం క్లారిటీ ఇవ్వడంతో.. ఈ అంశంపై కేంద్రంపై ఏ రకంగా పోరాటం చేయాలనే అంశంపై సీఎం కేసీఆర్‌ మంత్రులతో చర్చిస్తున్నారు.

టీఆర్‌ఎస్‌ మంత్రులు నిన్న కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ భేటీ అయ్యారు. తెలంగాణలో రైతులు పండించిన ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని టీఆర్‌ఎస్‌ మంత్రులు  డిమాండ్ చేశారు. అయితే ఇది సాధ్యపడే విషయం కాదని.. సరఫరా, అవసరాలు, ముందుగా చేసుకున్న ఒప్పందం మేరకు మాత్రమే రాష్ట్రం నుంచి ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్ర ఆహారమంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు.

ఢిల్లీలో జరిగిన పరిణామాలను సీఎం కేసీఆర్‌కు వివరించిన మంత్రుల బృందం భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండాలనే అంశంపై ఆయనతో చర్చిస్తున్నారు. కేంద్రం ధాన్యం కొనుగోలు విషయంలో క్లారిటీ ఇవ్వడంతో.. ఈ అంశంపై కేంద్రంపై ఏ రకంగా పోరాటం చేయాలనే అంశంపై సీఎం కేసీఆర్ మంత్రులతో చర్చిస్తున్నారు.

ఈ సమావేశంలో అనేక అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. యాసింగిలో రైతులు పండించే పంట త్వరలోనే కోతకు రానుంది. దాన్ని కొనుగోలు చేయడంతో పాటు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఏ విధంగా ముందుకు సాగాలనే దానిపై టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఉగాది తరువాత ఈ మేరకు ముందుకు సాగాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంద‌ని తెలుస్తోంది.

Related posts