telugu navyamedia
ఆంధ్ర వార్తలు

విజయవాడలో కోర్టు కాంప్లెక్స్‌ ప్రారంభించిన సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ

*విజ‌య‌వాడ‌లో జిల్లా కోర్టు భ‌వ‌న‌ స‌ముదాయం ప్రారంభం
*వంద కోట్ల‌తో 9 అంత‌స్తుల భ‌వ‌న నిర్మాణం
*ఒకే భ‌వ‌నంలో 36 కోర్టులు..

విజ‌య‌వాడ‌లో జిల్లా కోర్టు నూతన భవన సముదాయాన్ని శనివారం ఉదయం భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ శనివారం ఉదయం ప్రారంభించారు.నగరం మధ్యలో ఉన్న సివిల్ కోర్టుల ప్రాంగ‌ణంలో 100కోట్ల వ్యయంతో 9 అంత‌స్తుల భ‌వనాన్ని నిర్మించారు.

ఈ కార్యక్రమానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఇతర ఇతర హైకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు.

సిటీ సివిల్‌ కోర్టు భవన సముదాయ ప్రారంభ కార్యక్రమానికి ముందు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణను సీఎం జగన్‌ మర్యాదపూర్వకంగా కలిశారు.

అనంతరం కోర్టు కాంప్లెక్స్‌ ఆవరణలో సీజే రమణ, సీఎం జగన్‌లు కలిసి మొక్క నాటారు. కాగా.. వీవీఐపీల రాక సందర్భంగా ఈ మార్గంలోకి వాహనాలు రాకుండా పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించారు.

Related posts