ఐపీఎల్ 2021 ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ తమ జట్టులో కీలక మార్పు చేసింది. వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్ ఆడలేనని తప్పుకున్న ఆ జట్టు స్టార్ పేసర్ జోష్ హేజిల్ వుడ్ స్థానంలో మరో ఆస్ట్రేలియా పేసర్ జేసన్ బెరెండార్ఫ్‌ను తీసుకుంది. ఈ విషయాన్ని సీఎస్‌కేనే ట్విటర్ వేదికగా శుక్రవారం వెల్లడించింది. ఈ సమ్మర్ ఐపీఎల్ 2021లో భాగమయ్యేందుకు జేసన్ బెరెండార్ఫ్ సూపర్ లయన్ టీమ్‌తో కలిసాడనే క్యాప్షన్‌తో ట్వీట్ చేసింది. 2019లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన బెరెండార్ఫ్.. ఆ జట్టు తరఫున కేవలం ఐదు మ్యాచ్‌లు ఆడాడు. ఈ 5 మ్యాచ్‌ల్లో 5 వికెట్లు తీశాడు. అనంతరం ఈ ఆసీస్ పేసర్‌ను తీసుకోవడానికి ఏ ఫ్రాంచైజీ ముందుకురాలేదు. ఇక ఆస్ట్రేలియా తరఫున 11 అంతర్జాతీయ వన్డేలతో పాటు 7 టీ20లు ఆడాడు. వన్డేల్లో 16, టీ20ల్లో 7 వికెట్లు తీశాడు. అయితే మెగాటోర్నీలకు సన్నదం కావడంలో కోసమే ఐపీఎల్ నుంచి తప్పుకున్నట్లు హేజిల్ వుడ్ పేర్కొన్నాడు.
previous post
next post
సీఎంకు అధికారాలు లేవని సీఎస్ ఎలా అంటారు: రాజేంద్రప్రసాద్